ఎన్టీఆర్ ,మహేష్ ల మధ్య వార్ పెంచుతున్న “ట్యూన్స్”

దసరా పండగ కి తెలుగు ప్రేక్షకులకి కానక ఇవ్వడానికి టాలీవుడ్  హీరోలు రెడీ అయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు మహేష్ ,జూ.ఎన్టీఆర్ లు ఒకరి తరువాత మరొకరు సెప్టంబర్ లో దసరా బరిలో నిలవనున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’తో సెప్టెంబర్ 21 నే వచ్చేస్తుండగా.మహేష్ బాబు తన ‘స్పైడర్’ తో సెప్టెంబర్ 27 న థియేటర్స్ లోకి దిగిపోనున్నాడు.వీటితో పాటు  మారుతీ – శర్వానంద్ ల ‘మహానుభావుడు’ కూడా ఈ దసరాకే రానుంది.

jai lavakusa కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉంటే ఇప్పుడు  ఎన్టీఆర్ సినిమా ‘జై లవ కుశ’ ట్యూన్స్ చాలా పాతగా ఉన్నాయని ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయని, దేవిశ్రీ పాత సినిమాలో  ట్యూన్స్ కాపీ కొట్టాడు అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక మహేష్ ‘స్పైడర్’ పాటల పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. హరీష్ జై రాజ్ పాత ట్యూన్స్ నే ఇచ్చాడని  అసలు ‘స్పైడర్’ రెండు పాటలు తమిళ వాసన కొడుతున్నాయనే టాక్ మొదలయ్యింది.

spider mahesh కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇద్దరి హీరోల మధ్య ఈ పాటల ఆల్బమ్స్ యుధం భారీగా జరుగుతోందట. మీ సినిమా పాటలు బాలేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోపక్క మీ సినిమా పాటలే బాలేదు అని మహేష్ ఫ్యాన్స్ ఒకరిని ఒకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్లిందంటే ‘స్పైడర్’సినిమా పాటల విడుదల మేము అడ్డుకుంటాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యేలా జరిగింది. దేవిశ్రీప్రసాద్ ,హారిస్ జై రాజ్ లు ఇద్దరు కూడా ట్యూన్స్ సరిగా ఇవ్వలేదనే టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా వీరి మాటల యుద్ధం సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *