జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్‌… గెస్ట్‌గా బాల‌య్య‌..?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ త్రి పాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఇక కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుకగా సెప్టెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతోంది. ఇక ఈ సినిమా ఆడియోను ఆగ‌స్టు 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా  జైల‌వ‌కుశ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోకి చీఫ్ గెస్ట్‌గా బాల‌య్య‌ను ఆహ్వానించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.
ఈ సినిమాను ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్ త‌న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కించారు. ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇద్దరు కలిసి బాబాయ్ బాలకృష్ణను గెస్ట్ గా పిలిస్తే మాత్రం ఇక ఆ ఆడియో వేదిక నందమూరి ఫ్యాన్స్ కు పండుగ తెచ్చిపెట్టినట్టే. అయితే బాలయ్య వచ్చినా రాకున్నా హరికృష్ణ మాత్రం ఈ ఆడియోకి అటెండ్ అవుతారని తెలుస్తుంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *