saptami gowd

“కాంతారా” సినిమా కోసమే ఆ పని చేశా….వైరల్ అవుతున్న హీరోయిన్ కామెంట్స్…!!

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు, పట్టించుకునే వారు కూడా కాదు. కానీ ప్రస్తుతం కన్నడ సినిమాల పై క్రేజ్ పెరుగుతోంది. కేజిఎఫ్ తరువాత ఆ స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో “కాంతారా” మూవీ అందరిని ఆకట్టుకుంది. చక్కని కధాంశం తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. ఈ నేపధ్యంలో కాంతారా సినిమా హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

kantara heroine

రిషబ్ శెట్టికి కాంతారా సినిమా ఎంతటి పేరు ను తెచ్చిపెట్టిందో అలాగే హీరోయిన్ లీల గా నటించిన సప్తమి గౌడ కు కూడా అంతే క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె లుక్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. సంప్రదాయబద్దమైన పాత్రలో కనిపించిన సప్తమి ఆ లుక్ రావడం కోసం దర్శకుడు సూచించిన దానికంటే కాస్త ఎక్కువే శ్రమించిందట. రెండు ముక్కుపుడకలతో అందరిని ఆకట్టుకున్న సప్తమి అందుకోసం తాను ఏం చేయాల్సి వచ్చిందో చెప్పింది.

ఈ సినిమాపై ముందు నుంచీ తనకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే తనకు చిన్న తనం నుంచీ ముక్కు పుడక కుట్టించుకోవడం ఇష్టం లేకపోయినా సరే తన రెండు ముక్కుకు రెండు వైపులా ముక్కు కుట్టించుకున్నానని తెలిపింది. అయితే సినిమాలో రెండు ముక్కుపుడకలు చూసి అందరూ ఇవి ఇన్స్టాంట్ గా అతికించుకున్నవని, అందరు హీరోయిన్స్ ఇలానే చేస్తారని అనుకున్నారు అందరూ కానీ ఒరిజినాలిటీ రావడం కోసం తనకు ఇష్టం లేని పని చేశానని. ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించడంతో అవేమి తనకు పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *