టిఆర్ఎస్ లోకి దిల్ రాజు..కేసీఆర్ ఆఫర్ ఇదే

పాలిటిక్స్ లోకి వెళ్ళడం అంటే ప్రతీ ఒక్కరికీ ఆశక్తిగానే ఉంటుంది,రాజకీయాలలో ఉండే ఆ మజానే వేరు, చుట్టూ బలగం పేరు ప్రఖ్యాతలు,డబ్బూ,అబ్బో ఇలా ఇన్ని రకాల ఫెసిలిటీలు ఉంటే ఎవరు అవకాశాన్ని వదులుకుంటారు చెప్పండి. కాకపోతే కొంచం డబ్బు సమాజంలో కొద్దిగా పలుకుబడి ఉంటే వారికి పాలిటిక్స్ లో తిరుగేలేదు. సినీమా వాళ్ళకి ఇలాంటి అవకాశం  ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఅర్ దగ్గర మొదలైన సినిమా వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.

సినిమా పరిశ్రమ నుంచి  చాలా మంది ఇప్పుడు  తెలంగాణ‌ రాజకీయాలలో తమదైన పాత్రలని పోషిస్తున్నారు  ఇక,ఇప్పుడు తాజాగా  బ‌డా నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కూడా త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు   మీడియా లో పెద్ద టాక్ ఏంటంటే  2019లో ఆయ‌న ఎంపీగా కూడా పోటీ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్న దిల్ రాజుకు ఆ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ నుంచి ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని,అప్పుడే రాజుకి ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలి అన్నవిషయంలో రాజు అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ తెలుసుకున్నారు అని తెలుస్తోంది. ఫిదా చుసిన కేసీఆర్ దిల్ రాజుతో ప్రత్యకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని సినిమా కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన కేసీఆర్ వెంటనే రాజకీయాలలోకి ఆహ్వానించారట అంతేకాదు రాజు కోరిక మేరకు . ప్ర‌స్తుతం కేసీఆర్ త‌న‌య క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్ ఎంపీ సీటును రాజుకు కేటాయిస్తార‌నిచెబుతున్నారు. 

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత రాష్ట్ర రాజకీయాలలో కి రానున్న తరుణంలో ఆ స్థానంలో దిల్ రాజుకి అవకాసం ఇవ్వనున్నారు. నిజామాబాద్ అంటే టీఆర్ఎస్ కి కంచుకోట కాబట్టి గెలుపుకోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. సో సినిమా ఇండస్ట్రీ నుండీ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అప్పటి సమీకరణాలు ఎలా ఉండబోతాయో వేచిచూడాల్సిందే.  

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *