అంచనాలు పెంచుతున్న కీర్తి సురేష్ “మిస్ ఇండియా ట్రైలర్”

ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న ఆమె మిస్ ఇండియా సినిమా తో మరో సెన్సేషనల్ హిట్ కొట్టడానికి సిద్దంగా ఉన్నారు. ఆమె తాజాగా నటించిన మిస్ ఇండియా సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

Miss India (film) - Wikipedia

గత సినిమాలలో ఎంతో బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో కాస్త సన్నబడింది. అంతేకాదు ఎంతో స్టైలిష్ గా ఓ బిజినెస్ విమెన్ గా ఆమె ఈ సినిమాలో కనిపించబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కి విశేషమైన స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఓ మధ్య తరగతి కుటుంభంలో పుట్టన అమ్మాయి చిన్నతనం నుంచీ బిజినెస్ చేయాలని అనుకోవడం అది సాధించడం, మధ్యలో అవాంతరాలు ఎదుర్కోవడం ఇవన్నీ ఈ సినిమాకి హైలెట్ గా నిలువనున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *