ప్రభాస్ ని పెళ్ళిచేసుకుంటా…కోల్ కతా అమ్మాయి..ఏమి చేసిందో తెలుసా

పెళ్ళంటు చేసుకుంటే ప్రభాస్ ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని మొండిపట్టు పట్టింది కోల్కతాకి చెందిన ఓ అమ్మాయి. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సుభ‌ద్రా ముఖ‌ర్జీకి ప్ర‌భాస్ అంటే చాలా ఇష్టమ‌ట‌. ప్రభాస్ ని   పెళ్లి చేసుకోవ‌డానికి తాను దేనికైనా సిద్ధ‌ప‌డ‌తాన‌ని సుభ‌ద్రా ముఖ‌ర్జీ శ‌ప‌థం చేసింది. ప్రభాస్ పుట్టిన‌రోజున (అక్టోబ‌ర్ 23) తన ప్రేమని  తెలియ‌జేయ‌డానికి హైదారాబాద్‌కి వ‌చ్చేందుకు ఆమె సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్‌ను క‌లిసేలా చేస్తాన‌ని ఆయ‌న సెక్ర‌ట‌రీ హామీ ఇచ్చారట.

 సుభ‌ద్ర ఒక సాధారణ మోడల్ గా పనిచేస్తోంది , ప్ర‌భాస్ కోసం సుమారు రూ. ల‌క్ష పెట్టి బాహుబలి విగ్రహాన్ని కూడా సుభ‌ద్ర త‌యారు చేయిస్తోంది. ఈ విగ్ర‌హానికి కాస్ట్యూమ్ డిజైనర్ సమరేంద్ర సింగ్ రాయ్ దుస్తులు డిజైన్ చేస్తున్నారు. ఈ దుస్తుల ఖ‌ర్చే రూ. 20వేలు. అంతేకాకుండా ప్ర‌ముఖ గాయని ఉషా ఉతుప్‌తో ప్రభాస్‌పై నాలుగు పాటలు కూడా పాడించింది. ప్ర‌భాస్‌కు ప్ర‌పోజ్ చేసే రోజున ధ‌రించ‌డం కోసం కాంజీవ‌రం చీర కూడా సిద్ధం చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌ను క‌లిశాక ఎలా ప్ర‌పోజ్ చేయాలి అనే అంశాన్ని సాధ‌న చేస్తోంద‌ట‌ ఈ కోల్ కత్తా సుందరి .

 బాహుబలి 2′ సినిమాని 20 సార్లు చూసింద‌ట‌ ఎందుకని అడిగితే ప్రభాస్ కోసమే అంటూ మురిసిపోతూ చెప్తోందట.ఈ విషయం తన కుటుంభ సభ్యులకి కూడా తెలుసునని.వారి అనుమతితోనే నేను ప్రభాస్ ని కలవడానికి వస్తున్నాను అని అంటోందట.బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పెళ్లిపై వచ్చిన వార్తలు చూసి చాలా ఆందోళ‌న చెందింద‌ట‌. మ‌రి ప్ర‌భాస్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో తన పుట్టినరోజు వరకు వేచిచూడాలి.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *