“అజ్ఞాతంలో”…లగడపాటి..!!!
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలు మరోమారు బొక్కబోర్లా పడ్డాయి గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి అధికారంలోకి వస్తుందని తెగేసి చెప్పిన లగడపాటి. ఆ ఎన్నికల్లో లో తన వ్యక్తిత్వం చంపుకుని మరీ కూటమికి అమ్ముడుపోయారని ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కూడా నిద్ర రావటం లగడపాటికి కోలుకోలేని షాక్ ఏ అంటున్నారు.

ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పిన ఆక్టోపస్ లగడపాటి తాజాగా వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలతో మరోసారి చంద్రబాబుకు అనుకూలంగా సర్వే ఫలితాలను ప్రకటించారని తేటతెల్లమవుతోంది ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో ఏపీలో ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయమని తేలడంతో లగడపాటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటున్నారు వైసీపీ నేతలు. లగడపాటిని సర్వేలు నమ్ముకుని అధికార టిడిపి అనుయాయులు, ఒక వర్గం నేతలు భారీగా బెట్టింగులు భారీగా పట్టారని ఇప్పుడు వారందరూ లగడపాటిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. మరి లగడపాటి అజ్ఞాతం వీడి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో వేచి చూడాలిసిందే