మరో సంచలనం –  గవర్నర్ తో “లగడపాటి” భేటీ…??

విశాఖ ఎయిర్పోర్ట్ లో వైసీపీ అధినేతపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం అవుతోంది. ఈ దాడి తరువాత హుటాహుటిన మోడీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళారు గవర్నర్ నరసింహన్. మరో పక్క చంద్రబాబు నాయుడు గవర్నర్ తీరుని తప్పు బట్టడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఒక పార్టీ అధినేతకి జరిగిన దాడి ఘటనన వివరాలు అడగకూడడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Image result for governor narasimhan

ఇదిలాఉంటే ఢిల్లీ వెళ్ళిన గవర్నర్ నరసింహన్ తో భేటీ కావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్నిసంస్థలు..రాజకీయ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చోటు చేసుకొంటున్న నేపథ్యంలో  గవర్నర్  ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి కల్గిస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో  ఢిల్లీలో  ఉన్న గవర్నర్ మోడీతో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై గవర్నర్  ప్రధాని మోడీకి  రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.

Image result for lagadapati

అయితే జగన్ పై దాడి జరిగిన ఘటన సైతం ఈ సమావేశంలో చర్చకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానితో గవర్నర్ భేటీ తర్వాత  గవర్నర్ నరసింహాన్ ‌తో  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో కాకరేపుతోంది..రాష్ట్ర రాజకీయాల్లో కాక రేగుతున్న సమయంలో లగడపాటి గవర్నర్ తో భేటీ కావడం వెనుక  అంతర్యమేమిటనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *