“RRR” లో మహేష్, అమితాబ్ కూడానా..??

టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “RRR”. ఈ చిత్ర బృందం విడుదల చేసే ఒక్కొక్క అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం రాజమౌళి దర్శకత్వం తో పాటు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కలిసి చేస్తున్న సినిమా ఇది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించి ఫాన్స్ కు మంచి  ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇంతేనా..

ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ఇచ్చిన సమాచారం ప్రకారం, బాలివుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా సినిమాలో కనిపించనున్నారు. ఇంకా బాలీవుడ్ నటి ఆలియా భట్ రామ్ చరణ్ కు జంటగా చేస్తున్నారు, హాలివుడ్ నటి ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ పక్కన సందడి చేయనున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. అయితే

 

ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో సమాచారం ఏంటంటే.. మహేష్ బాబు, అమితాబ్ కూడా భాగామవుతున్నారనే ఆసక్తికర విషయం టాలివుడ్  ఇండస్ట్రీ లో చెక్కెర్లు కొడుతోంది.. కాకపోతే వీరు కనిపించరు వినిపిస్తారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కు మహేష్ బాబు,  హిందీ వర్షన్ కు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈ విషయమై రాజమౌళి.. మహేష్, అమితాబ్ లతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని తమిళ్, మలయాళంలో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి, రాజమౌళి ఎవరిని ఎంచుకున్నారనే సమాచారం ఇంకా రాలేదు. ఏది ఏమైనా దర్శక ధీరుడు రాజమౌళి టాలివుడ్,బాలివుడ్,హాలివుడ్ స్టార్స్  అందరిని ఒకే తెరపై చూపించి  అభిమానులను విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *