కొలిక్కి వచ్చిన “సీట్ల సర్దుబాటు”..టీడీపీ పోటీ చేసే “ఆ స్థానాలు” ఇవే..!!

తెలంగాణా ఎన్నికలు దగ్గర పడటంతో సీట్ల సర్దుబాటుపై లెక్కలు తేలిపోయాయి..కేసీఆర్ ని గద్దె దింపడానికి కాంగ్రెస్ తో చేతులు కలిపిన తెలుగుదేశం, తెలంగాణా సమితి, వామపక్షాలు అన్నీ తాము పోటీ చేయాలనుకున్న స్థానాలు..అలాగే సీట్ల లెక్కలు తేల్చుకున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు కొన్ని ఖరారైనట్లు తెలుస్తోంది2014లో తాము గెలిచిన స్థానాల్లో ఈసారి పోటీ చేసేందుకు తెలంగాణ టీడీపి ఆసక్తి కనబరుస్తోంది. ఎందుకంటే ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలు కూడా అందులో ఉన్నాయి.

Image result for ttdp

 లేకపోతే భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేని పక్షంలో ఆయా సీట్లు టీడీపీకే దక్కుతాయని అంటున్నారు. ఉప్పల్‌.. ఎల్బీనగర్‌   కూకట్‌పల్లి..శేర్‌లింగంపల్లి..రాజేంద్రనగర్‌..మహేశ్వరం..కోరుట్ల..సత్తుపల్లి..ఖమ్మం  టీడీపికి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 8 సీట్లకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.. టీడీపి తెలంగాణ అధ్యక్షుడు రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖరారైనట్లు సమాచారం.

 

అయితే మిగిలిన స్థానాలలో అంటే కోదాడ..మహబూబ్‌నగర్‌..దేవరకద్ర సీట్లను కూడా టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండటంతోదానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ కాంగ్రెసును కోరుతున్నట్లుగా తెలుస్తోంది ముషీరాబాద్‌..ఖైరతాబాద్‌ సీట్లు కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లుగా కుత్బుల్లాపూర్‌మహేశ్వరంమక్తల్‌ సీట్లను వీలైతే తీసుకోవవడానికి టీడీపి సిద్ధంగా ఉంది..ఇక ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీ కి బలమైన కేడర్ ఉండటంలో ఈ సారి నామాని అక్కడ అసెంబ్లీ నుంచీ పోటీకి దించాలని చూస్తోంది టీడీపీ అధినాయకత్వం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *