“#Me Too”  కి కౌంటర్ గా  “#Men Too”

“ఆ డోళ్ళ” కేనా “మగాళ్ళ” కి కూడా కావాలి రక్షణ అంటూ సరికొత్త ఉద్యమం మొదలవుతోంది. ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం  “Me Too”… ఈ “Me Too” దెబ్బకి కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల వ్యవహారాలు సైతం ఈ సమయంలో బయటకి వచ్చాయి అయితే ఇందులో కొంతమంది మహిళలు ప్రచారానికి కూడా ఈ “Me Too” ఉద్యమాన్ని వాడుకోవడంతో భాదిత మగాళ్ళు గగ్గోలు పెట్టారు.

Image result for men too

అలాంటి వారికోసం మేమున్నాము అంటూ వచ్చింది “Men Too” ఆడవాళ్లకే నా లైంఘిక వేధింపులు మగవాళ్ళకి ఉండవా అంటూ వెలుగులోకి తీసుకొస్తున్న“Men Too” ఉద్యమానికి ఆదిలోనే విపరీత ఆదరణ మొదలయ్యింది.  ‘మీటూ’ ఉద్యమం తరహాలోనే.. స్త్రీల వేధింపులు, సాధింపులనూ వెలుగులోకి తేవడానికి ‘మెన్‌టూ’ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘క్రిస్ప్‌’ అనే స్వచ్ఛంద సంస్థ

Image result for men too

ఈ సంస్థ నిర్వహించేది ఎవరో కాదు సామాజిక కార్యకర్త కుమార్‌ జాగిర్దార్‌. ఆయన మరో 15 మందితో కలసి తాము ఈ సంస్థని ప్రారంభించాడు. తప్పుడు కేసులు, ఆరోపణల కారణంగా బాధపడుతున్న పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు..ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే  వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్‌ మాజీ రాయబారి పాస్కల్‌ మజురియర్‌ ఉండటం విశేషం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడని ఆయనపై భార్య కేసు పెట్టింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని 2017లో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.. భార్యా భాదితులకి..ఈ మెన్ టూ ఉద్యమం తప్పకుండా ఉపయోగ పడుతుందని అంటున్నారు నిర్వాహకులు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *