డీజే ఆఫీస్‌పై మెగా ఫ్యాన్స్ దాడి..

ఇటీవ‌ల త‌రచూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో వార్త‌ల్లోకెక్కుతోన్న స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ త‌ర‌చూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల బ‌న్నీ న‌టించిన డీజే సినిమా భారీ వ‌సూళ్ల‌తో సాధిస్తోందంటూ డీజే ఫ్యాన్స్ అతి ప్ర‌చారం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. డీజే ఫ‌స్ట్ వీక్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిందంటూ డీజే టీం ప్ర‌చారం చేసింది.
ఇక ఈ క్ర‌మంలోనే సినిమాకు స‌రైన టాక్ లేకున్నా డీజే టీం క‌లెక్ష‌న్లు బాగా ఎక్కువగా చూపుతోంద‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపించింది. ఇక హ‌రీశ్ శంక‌ర్ అయితే నైజాంలో డీజే రూ.20 కోట్లు వ‌సూలు చేసిందని, ఇది త‌ప్ప‌ని ఎవ‌రైనా ఫ్రూవ్ చేయాల‌ని స‌వాల్ విస‌ర‌డం కూడా కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కంటే ‘ అత్యధిక కలెక్షన్లు సాధించిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై మెగా ఫ్యామిలీ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ డీజే ఆఫీస్‌పై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు.
మెగా అభిమానుల దాడితో షాక్ తిన్న చిత్ర నిర్మాత దిల్ రాజు వారికి స‌ర్ది చెప్పేందుకు నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింది. అయినా మెగా అభిమానులు మాత్రం డీజే టీం ఓవ‌ర్ యాక్ష‌న్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *