చిరు ఏంటిది..షాక్ అయిన అభిమానులు..ఆశ్చర్యపోయిన చరణ్..
మెగా స్టార్ చిరంజీవి తన మెగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన చిరు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా చిరు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫోటో కేవలం అభిమానులనే కాదు. ఆయన తనయుడు చరణ్ ని సైతం షాక్ కి గురించేసింది. నాన్నా నేను చూస్తోంది నిజమేనా అంటూ చరణ్ కామెంట్ కూడా చేశాడు.
చిరు నున్నటి గుండుతో కన్పిస్తూ ,నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నేను సాధువుల ఉన్నానా అంటూ గుండు తో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో కేవలం కొన్ని నిమిషాలలోనే లైక్ లు కామెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇదిలాఉంటే ఇది నిజమైన గుండా లేక ఎడిట్ చేసిన ఫోతోనా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అభిమానులు.