నంద్యాల‌ను హీటెక్కిస్తోన్న ఆ న‌లుగురు..

నంద్యాల రాజుకుంది.. రంగంలోకి బాల‌య్య‌-బాబు-ప‌వ‌న్‌
నంద్యాల పోరు ఉద్రుతం అయింది. ఎన్నిక‌ల‌కు డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ పార్టీల అధినేతలు త‌మ త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక‌ను గెల‌వ‌డం ద్వారా అధికార పార్టీకి చెక్ పెట్టాల‌ని వైసీపీ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. అదేస‌మ‌యంలో త‌మ మూడేళ్ల అభివృద్ధి అజెండా పాల‌న‌కు ఈ ఎన్నిక రెఫ‌రెండం అని సీఎం బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. దీనికి ఇక‌, జ‌గ‌న్ అవినీతి-నైతిక‌త‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ధ‌ర్మ యుద్ధంగా పిలుపు నివ్వ‌డంతో మ‌సాలా మ‌రింత ఎక్కువైంది. ఈ క్ర‌మంలో ఎలాగైనా గెల‌వాల‌న్నా కాంక్ష ఇరు పార్టీల్లోనూ బ‌లంగా నాటుకుపోయింది.

ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలూ త‌మ అమ్ముల పొదిలోని అస్త్రాల‌ను ఒక్క‌టొక్క‌టిగా ప్ర‌యోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్.. నేరుగా అక్క‌డే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారాన్ని ఉర్రూత లూగిస్తున్నారు. గ్రామాలు, వీధులు, రోడ్లు ఇలా అందివ‌చ్చిన అంత‌టా క‌లియ‌దిరుగుతూ ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నెల 9నే ప్రారంభించిన త‌న ప్ర‌చారం ఈ నెల 21 వ‌ర‌కు సాగుతుంద‌ని వైసీపీ నేత‌లు చెప్పారు. దీనికి త‌గిన విధంగానే జ‌గ‌న్ అన్ని విధాలా ప్రిపేర‌య్యారు. దీనికితోడు ఆయ‌న‌కు నోటి దూల కూడా పెరిగిపోయింది. బాబును  ఎంత‌మాటంటే అంత మాట అనేస్తున్నారు.

రెచ్చిపోయి మాట్లాడ‌డాన్ని సాహ‌సంగా భావిస్తున్న జ‌గ‌న్‌.. దానిద్వారా ఓట్లు కొల్ల‌గొడ‌దామ‌ని భావిస్తున్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. ఆరుగురు మంత్రులు నంద్యాల‌లో సెటిల్ అయిపోయారు. వీరు త‌మ అధినేత బాబు క‌నుస‌న్న‌ల్లో ప్ర‌చారాన్ని ఉద్రుతం చేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నారు. ఇక‌, ఎన్నిక‌కు స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ.. మ‌రింత ప్ర‌చార తీవ్ర‌త పెంచాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే త‌మ క్షిప‌ణుల‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని డిసైడ్ అయింది.

దీనిలో భాగంగా పాపుల‌ర్ ఫిగ‌ర్‌, హిందూపురం టైగ‌ర్ నంద‌మూరి బాల‌కృష్ణ‌ను రంగంలోకి దింపాల‌ని డిసైడ్ అయింది. భూమా బ్ర‌హ్మానంద రెడ్డి త‌ర‌ఫున ఈయ‌న బుధ‌వారం ప్ర‌చారం హోరెత్తించ‌నున్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఆయ‌న టూర్‌కి కూడా ప్లాన్ జ‌రుగుతోంది. మ‌రో ఆర‌డుగుల బుల్లెట్‌.. పవ‌న్‌ను కూడా చంద్ర‌బాబు వినియోగిస్తున్నారు. ప‌వ‌న్ నేరుగా ప్ర‌చారంలోకి దిగ‌క‌పోయినా.. ఆయ‌నత‌న బ‌ల‌మైన ప్లాట్ ఫాం సోష‌ల్ మీడియా ద్వారా నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటారు. సో.. ఇలా నంద్యాల ప్ర‌చారం మొత్తం దుమ్ము రేపేందుకు టీడీపీ ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *