ఇదే జగన్ కొంపముంచిందా..!

నంద్యాల తీర్పు మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని టీడీపి ,వైసీపీ భావించిన తరుణంలో ఓటరు తీర్పు ఇప్పటి వరకూ జరిగిన  రౌండ్లలో టీడీపికి అనుకూలంగా వచ్చింది. టీడిపి శ్రేణులు సంభారాలలో ఉన్నారు. టీడీపి మంత్రివర్గం జగన్ మోహన్ రెడ్డి పై ముప్పేట దాడి చేస్తోంది. ఎవరికి తోచినట్టు వారు ఎన్నికల రిజల్ట్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు.ఏది ఏమైనా ఓటరు టీడీపికి మొగ్గు చుపుతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు  ఓటరు టీడీపి కి ఎందుకు మొగ్గు చూపినట్టు? ఏ కారణాలు వైసీపికి అనుకూలంగా లేవు అని చుస్తే.

   నంద్యాలలో వైసీపి కొంపముంచింది భుమా నాగిరెడ్డి సెంటిమెంట్.ఇదే ఇక్కడ బాగా వర్కౌట్ అయ్యింది.టీడీపి ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువేల్లడంలో సక్సెస్ అయ్యింది.చంద్రబాబు నాయడు కూడా తన ప్రచారంలో అఖిల ప్రియని ఉద్దేశిస్తూ తల్లీ ,తండ్రి లేని పిల్ల మీద మీ రాజకీయమా అని వీలు దొరికినప్పుడల్లా మాట్లాడటం ప్రజలలో ముఖ్యంగా మహిళలలోకి చొచ్చుకుని వెళ్ళింది.బాబు కి ఎక్కడ ఏ మాత్రం వేస్తే పని చేస్తుందో బాగా తెలుసు కాబట్టే సెంటిమెంట్ ని ప్రజలలోకి పంపడం లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సెంటిమెంట్ ని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి బాబు వాడిన టెక్నాలజీ బాగా సక్సెస్ అయ్యింది. అదేమిటంటే

bhuma nagi reddy death కోసం చిత్ర ఫలితం

  ప్రచారంలో భాగంగా టీడీపీ తమతో పాటు భారీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేసింది.ఈ స్క్రీన్స్ లో భుమా నాగిరెడ్డి మరణం తాలూకు వీడియో, శోభా నాగిరెడ్డి చనిపోయినప్పటి వీడియో లని మనసులకి హత్తుకునే ట్రాజెడీ మ్యూజిక్ తో మేళవించి  చూపిస్తూ నంద్యాల ప్రజలని సెంటిమెంట్ తో కట్టిపడేశారు.సాధారణంగా మన ఇండియా లో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది.ఇప్పుడు నంద్యాలలో అదే జరిగింది సానుభూతి తో టీడీపి గెలిచింది అనడంలో సందేహం లేనే లేదు.

  వైసీపి ఓటమికి నంద్యాలలో పారిన డబ్బు వరద, భుమా నాగిరెడ్డి సెంటిమెంట్, ఏపిలో అధికారంలో టీడీపి ఉండటం, ముఖ్యంగా సానుభూతి వైసీపి కొంపముంచింది అని వైసిపీ నాయకుల వాదన .ఈ ఎన్నికల రిజల్ట్స్  2019 సార్వత్రిక ఎన్నికలకి ఏ మాత్రం కొలమానం కాదని.నంద్యాలలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరిగిందని. ఈ కారణాలే వైసీపి ఓటమికి కారణం అయ్యాయి అని ఇది వైసీపి ఓటమి కాదని సానుభూతి గెలుపని  వైసీపి నాయకులు చెప్తున్నారు.  ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం.ప్రజల తీర్పును గౌరవించవలసిన భాద్యత అందరికి ఉంది అని,ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తాం అని చెప్తున్నారు వైసీపి నాయకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *