నంద్యాల సమరం -ఆరో రౌండ్‌లో టీడీపీకి 3,303 ఓట్ల ఆధిక్యం

మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన టీడీపీ ఆరో రౌండ్లోనూ లీడ్‌లో ఉంది. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి 3303 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ ముందంజలో ఉంది. ప్రస్తుతం నంద్యాల అర్బన్‌ మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తానికి ఆరు రౌండ్ల తర్వాత 15,435 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ లీడ్‌లో ఉంది. 6 నుంచి 16వ రౌండ్‌ వరకు నంద్యాల అర్బన్‌ ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత చిత్రం

టీడీపీ: 17,697, వైసీపీ: 11,624, కాంగ్రెస్: 211 ఓట్లతో లెక్కింపు కొనసాగుతోంది.

మొదటి రౌండ్‌‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5474 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4179 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీడీపీ 1295 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

రెండో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4726 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3945 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీ 1634 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మూడో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 7058 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3126 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీ 3,113 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

నాల్గవ రౌండ్ లో టీడిపి అభ్యర్ధి భుమా బ్రహ్మానందరెడ్డి 3600 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు

ఐదవ రౌండ్ లో 13135 వేల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *