బిగ్ బ్రేకింగ్‌: టీడీపీకి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గుడ్ “బై”

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక వేళ ఇప్ప‌టికే అధికార టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త వారం రోజుల్లో అక్క‌డ ముగ్గురు కీల‌క వ్య‌క్తులు పార్టీ మారిన నేప‌థ్యంలో షాకులో ఉన్న బాబుకు ఇప్పుడు మరో షాక్ త‌గిలింది.
టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. వచ్చే నెల 3న ఆయన వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు టీడీపీ నేతలు శిల్పాను ఆహ్వానించకపోవడంతో అలకబూనిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల నంద్యాలలో చంద్రబాబు పర్యటించిన సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఆయన ఫొటో కనబడకపోవడం కూడా ఆయన మనస్తాపానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత సోదరుడు చక్రపాణి కూడా వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడా వార్తలు నిజమయ్యాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *