కోనసీమలో  కొత్త వైరస్..!!ప్రజలలో పెరుగుతున్న భయం.!!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలో కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో మరో భయంకర వైరస్ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందో. మూగ జీవులలో గుర్తించిన ఈ వైరస్ కోనసీమలో వేగంగా వ్యాప్తి చెందుతూ వందలాది పశువుల,పక్షులు మృత్యువాత పడేలా చేస్తోంది.. వివరాలలోకి వెళితే..

 

కోనసీమలో కరోనాను తలపిస్తున్న ఈ వైరస్ ను హెర్సీస్ వైరస్ గా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ కు గురైన పశువులు కాని, పక్షులు కాని, వాటి శరీరంపై కంతులు వచ్చి, రంధ్రాలు ఏర్పడి  తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయని స్థానిక  ప్రజలు చెప్పారు. కొందరికి ఆ పశువులే జీవనాధారాలు,  తమ కళ్ళ ముందే వాటి ప్రాణాలు పోతోంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే..

 

ఈ వైరస్ ఉత్తరాది జిల్లాల నుంచి కోనసీమకు వ్యాపించి ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగిన, పశు వైద్యులు మాత్రం ఈ వైరస్ కు సంబంధించి ఎలాంటి మందు లేదని చెప్పారు. దీనితో అక్కడి ప్రజలలో భయాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ హెర్సీస్ వైరస్ వల్ల లంపి అనే స్కిన్ వ్యాధి సోకటం జరుగుతుంది. ఇది ఇలానే విజ్రుంభిస్తే ఇంకా ఎన్ని మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతాయో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.