అమెరికాపై ఉగ్రదాడి..బిన్ లాడెన్ మేనకోడలు సంచలన వ్యాఖ్యలు..

అమెరికాలో నవంబర్ మూడో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటూ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. కరోనాని  సైతం పక్కనపెట్టి ఎన్నికల గురించి సమాలోచన లో పడిన రాజకీయ నాయకులకు, అమెరికా ప్రజలకు బిన్ లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడెన్ దిమ్మ తిరిగిపోయేలా సంచలన వ్యాఖ్యలు చేశారు

Nour Bin Laden: New 9/11 Will Occur if Biden Wins

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపు ఓడిపోతే అమెరికాలొ మరోసారి 9 /11 తరహా దాడులు తప్పకుండా జరిగే అవకాశం ఉందని ఆమె న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించ గల సామర్థ్యం, సత్తా కేవలం ట్రంప్ కి మాత్రమే ఉన్నాయని మరోసారి అధ్యక్షుడిగా గనుక ట్రంప్ విజయం సాధించాక పొతే అమెరికా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా ఆమె తెలిపింది. అంతేకాదు ఒబామా  హయాంలో ఉగ్రవాదం ఎక్కువైపోయిందని, బిడెన్ అధికారంలోకి వస్తే అది మరింత ఎక్కువవుతుందని వ్యాఖ్యానించింది.

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *