“ఎన్నారై”…లకీ  “ఈ హక్కు”..!!!

భారత దేశం వదిలి విదేశాలకి వెళ్ళిపోయినా భారతీయులు కూడా భారత దేశానికి సంభందించిన ప్రతీ ఒక్క విషయం తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకు వీలుగా కేంద్రం వారికోసం సమాచార హక్కు చట్టాని వినియోగించుకునే అవకాసం కల్పించింది. ఇక నుంచీ ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం భారతీయులకు మాత్రమే ఆ అవకాశం ఉండేది కాని ఇప్పుడు ఎన్నారైలు సైతం ఈ హక్కుని ఉపయోగించుకోవచ్చు.

Image result for nris

 దీనికి సంబంధించిన సవరణలను ప్రభుత్వం తాజాగా చేసింది.’సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంది. ఎన్నారైలు అందుకు అర్హులు కాదు’ అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ దీన్ని లోకేష్‌ బత్రా అనే సామాజిక కార్యకర్త వ్యతిరేకించారు.

Image result for nris rti

ఈ మేరకు కేవలం భారతీయుడికి మాత్రమే సహ చట్టం ద్వారా అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు దీన్ని మరోసారి పరిశీలించిన ప్రభుత్వం ఎన్నారైలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నారైలు కూడా సహ చట్టం ద్వారా పాలనా పరమైన విషయాలను తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *