అక్క పొలిటికల్ ఎంట్రీ పై….ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్..!!!

ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు..ఈరోజు హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్పల్లి నుంచీ నామినేషన్ వేసిన సందర్భంగా బాలయ్య సుహాసిని కి శుభాకాంక్షలు తెలిపారు..మా కుటుంభం అండగా ఉంటుందని అన్నారు..ఈ నెల 26 నుచీ కూకట్పల్లి లో ప్రచారం చేస్తానని ప్రకటించారు కూడా అయితే ఆ సమయంలో ఓ విలేఖరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అని అడుగగా ఎవరి వీలు బట్టి వాళ్ళు వస్తారు అంటూ ఒకింత అసహజంగా జవాబు ఇచ్చారు ఇద్దంతో మీడియాలో సైతం ఎన్టీఆర్ ప్రచారం చేయరు అంటూ కామెంట్స్ రావడం మొదలు పెట్టాయి..దాంతో ఎన్టీఆర్ ఈ కన్ఫ్యూజన్ కి తెరదించారు..

Image result for suhasini nandamuri nomination

నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దిగుతున్నారు. ఆమె కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు మంచి నిర్ణయం తీసుకుని నేడు నామినేషన్ వేయనున్న తన సోదరి సుహాసినిగారికి అభినందనలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

 

మరోవైపు మరో సోదరుడు హీరో కళ్యాణ్ రామ్ కూడా సుహాసినికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఆ పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదని ఎన్టీఆర్ కళ్యాణ్‌రామ్‌లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన తండ్రి హరికృష్ణ సేవలను కూడా గుర్తు చేసిన సోదరులు తన సోదరిని కూడా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అంతేకాదు మహిళలు సమాజంలో ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం తమదని నందమూరి సోదరులు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవచేసేందుకు సిద్ధ పడుతున్న సుహాసినిగారికి విజయం వరించాలని ఆకాంక్షించారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *