ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా…పండ‌గ‌లాంటి న్యూస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజాగా న‌టిస్తున్న మూవీ జై ల‌వ‌కుశ‌. ఈ సినిమా ఈ ద‌స‌రాకి విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ 21న ఈ సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాత క‌ళ్యాణ్‌రామ్ ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా త‌ర్వాత జూనియ‌ర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో సినిమా కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోన్న ఎన్టీఆర్ అభిమానులు, టాలీవుడ్ సినీ అభిమానుల‌కు పండ‌గ‌లాంటి న్యూస్ వ‌చ్చేసింది. ఈ క‌థ‌పై తాజాగా త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ సిట్టింగ్ వేసి..ఫైన‌ల్ మార్పులు, చేర్పులు కూడా చేసిన‌ట్టు స‌మాచారం. త్రివిక్ర‌మ్ స్టైల్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *