బెజ‌వాడ‌లో జ‌గ‌న్ న‌యా ఆప‌రేష‌న్‌…

ఏపీ రాజ‌ధాని కేంద్ర‌మైన బెజ‌వాడ‌లో బ‌ల‌ప‌డేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ న‌యా ఆప‌రేష‌న్‌కు తెర‌లేపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టున్న వైసీపీకి బెజవాడలో మాత్రం పట్టులేదు. ఇక్క‌డ ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీ వీడి వెళ్లిపోయారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీ దిక్కులేనిదిగా మారిపోయింది. అయితే కొద్ది రోజులుగా ఇక్క‌డ జ‌గ‌న్ స్పెష‌ల్ కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.
బెజవాడలో వైసీపీ చాలా బలహీనంగా ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో జగన్ చేసిన కొన్ని తప్పులే. విజయవాడ సిటీలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జలీల్ ఖాన్ తర్వాత పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఇక్క‌డ వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. ఇక్క‌డ ముస్లింలు అధికంగా ఉండ‌డంతో ఇప్పుడు ఈ సీటును ముస్లింల‌కు ఇస్తున్న‌ట్టు స‌మాచారం.
ఇక ఇక్క‌డ సెంట్ర‌ల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న వంగ‌వీటి రాధా పార్టీలో అస్స‌లు యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఆయ‌న తీరు వ‌ల్ల‌ అసలు వంగవీటి కుటుంబం అనేది ఒకటుందా ? అన్న అనుమానం కలుగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరిన మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జితో పాటు విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించాలని జగన్ భావిస్తున్నారు.
వంగవీటి రాధకు తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లోనూ మార్పులు తప్పవంటున్నారు వైసీపీ నేతలు. మ‌రి బెజ‌వాడ‌పై ప‌ట్టుకు జ‌గ‌న్ స్టార్ట్ చేసిన ఈ న‌యా ఆప‌రేష‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  చూడాలి.
Also Read: http://www.telugustarnews.com/telugu/four-tdp-mps-ready-to-leave-the-party/

టీడీపీకి న‌లుగురు ఎంపీలు గుడ్ బై..!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *