పైసా వసూల్ లో “ట్విస్ట్” ఇదే…

పైసా వసూల్ కోసం  టాలీవుడ్ ,ఆంధ్రా,తెలంగాణా,దేశవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు లేనంత క్రేజ్ ఎందుకు అంటే ఈ సినిమా బాలయ్య,పూరీ కాంబినేషన్లో రావడమే కారణం.అయితే బాలయ్య అభిమానులని మరింత ఉత్ఖంటకు గురిచేస్తున్న విషయం ఒకటి ఇప్పుడు హాల్ చల్ చేస్తోంది. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ వార్త షికార్లు చేస్తుంది. పూరీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి కథను పోలీ పైసా వసూల్ ఉంటుందని టాక్.

paisa vasool official posters కోసం చిత్ర ఫలితం

 పైసా వసూల్ ట్రైలర్ చూస్తే ఆ విషయం అటు ఇటుగా అర్ధమైపోతుందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. సోషల్ మీడియాలో సైతం పైసా వసూల్ లో బాలయ్య మేనరిజం, పోకిరిలో మహేశ్ మేనరిజం ఒకేలా ఉందని. పోకిరీలో మహేశ్ అండర్ కవర్ కాప్ అనే విషయం విలన్స్ కి సెకండాఫ్ లో తెలుస్తుంది. కానీ పైసా వసూల్ ఓ బాలయ్య తానో అండర్ కవర్ కాప్ అని విలన్స్ కి చెబుతూనే వాళ్ళతో ఆడుకుంటాడట. సినిమాలో ట్విస్ట్ ఏముంది అనుకుంటున్నారా? ఉంది.

 బాలయ్య కి పొలీస్ డిపార్ట్ మెంట్ కి ఎటువంటి సంభందం లేదు అనేది సినిమాలో ట్విస్ట్. ఈ ట్విస్ట్ ని కూడా పూరీ చాలా డిఫ్ఫ్రెంట్ గా ప్లాన్ చేశాడట.ఈ సీన్ రాగానే అభిమానులు ఈలలు గోలలతో సందడిచేయడం ఖాయం అంటున్నాయి చిత్రవర్గాలు.అయితే ఇది నిజమా కాదా ? ఎలాంటి ట్విస్ట్ లు ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి సెప్టెంబర్ 1 న విడుదలయ్యే బాలయ్య పైసా వసూల్ చూడాల్సిందే

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *