జగన్ పై కుట్రలో భాగమే..నిన్న అంతర్వేది..నేడు పోతురాజు గుడి

ఏపీలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు. అంతర్వేది ఘటన చల్లారక ముందే , నిన్నటి రోజున విస్సన్న పేట గుడి గోడ కూలిపోవడం తో పాటు ఈరోజు కృష్ణా జిల్లా బంటుమిల్లి కి వెళ్ళే దారిలో ఉన్న దేవాతా వృక్షానికి ఆనుకుని ఉన్న పోతు రాజు విగ్రహాన్ని ద్వంసం చేశారు దుండగులు. అంతేకాదు

గుడిలో ఉండే హుండీని సైతం ఎత్తుకుపోయారు దాంతో ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేస్తూ గ్రామస్తులు నిరసనకి దిగినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా పచారం అవుతోంది.ఇదిలాఉంటే ఈ ఘటనలు అన్నీ రాజకీయ పరమైన దాడులుగా భావిస్తున్నారు పరిశీలకులు. ఏపీలో హిందుత్వ వాదాన్ని తీసుకువచ్చి మత రాజకీయాలు చేయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

YSRCP will win 137 seats in 2019 elections: YS Jagan

జగన్ ప్రభుత్వం ఏపీలో తిరుగులేని శక్తిగా మరింత బలపడుతున్న క్రమంలో కేవలం మత రాజకీయాల ద్వారానే జగన్ ని ఎదుర్కోవడానికి వ్యూహాలు పన్నుతున్నట్టుగా భావిస్తున్నారు నిపుణులు. ఏది  ఏమైనా సరే ఏపీలో ఎన్నడూ లేని విధంగా హిందూ దేవుళ్ళపై దాడులు జరగడం వెనుక జగన్ ప్రభుత్వాని దోషిగా నిలబెట్టే కుట్రలు  జరుగుతున్నాయనడంలో సందేహం లేదని అంటున్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *