పతంజలి “బ్రాండెడ్ జీన్స్”… కేవలం రూ .500/-

రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులకి  దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ కలిగిందో వేరేగా చెప్పనవసరం లేదు. దాదాపు ఆరేళ్ళ క్రితం మార్కెట్ లోకి విడుదలైన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు మార్కెట్ లోకి బ్రాండెడ్ కంపెనీలతో పోటీ పడుతూ అమ్ముడు పోతున్నాయి..దేశీయ ఉత్పత్తులు అనే పేరుతో విడుదలైన ఈ పతంజలి ప్రొడక్ట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.ఇదిలాఉంటే దేశీ ఉత్పత్తుల లిస్టు లోకి పతంజలి దుస్తుల్ని కూడా ప్రవేశపెట్టింది.

Image result for patanjali paridhan franchise

‘పతంజలి పరిధాన్‌’ పేరిట ఢిల్లీలో తొలి స్టోర్ ప్రారంభమైంది. దీన్ని రాందేవ్ బాబా ప్రారంభించారు..ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా పరిధాన్‌ జీన్స్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రాందేవ్‌ బాబా తెలిపారు. 2020  నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు..

Image result for patanjali paridhan franchise

.అయితే పతంజలి జీన్స్‌ రూ.500కే లభించనున్నాయి. రూ.2500 బ్రాండెడ్‌ షర్ట్స్‌ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. ‘ఆస్థా’, ‘సంస్కార్‌’, ‘లైవ్‌ ఫిట్‌’ బ్రాండ్స్‌ కింద దాదాపు  3500 రకాల వస్త్రాలు, షూస్‌, యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు…అయితే ఇవన్నీ దేశీయ ఉత్పత్తులు మాత్రమే కాదు మనకి ఎటువంటి హాని కలిగించని ఉత్పత్తులని రాందేవ్ బాబా పేర్కొన్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *