పంచాయితీ ఎన్నికలకి…“సై”

జనసేన అధినేత తలపెట్టిన కవాతు కార్యక్రమానికి ఊహించని స్థాయిలో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు హాజరయ్యారు..పవన్ కవాతు నుంచీ సభాస్థలికి అడుగు పెట్టగానే అక్కడే ఉన్న వీర మహిళలు పవన్ కి హారతులు ఇచ్చి దిష్టి తీసి ఆహ్వానం పలికారు..అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీని ఒక రేంజ్ లో ఆడుకోవడం మొదలు పెట్టారు..ఎప్పటిలాగానే చంద్రబాబు విధానాలపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ లోకేష్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు..

Image result for janasena kavathu

జనసేన పార్టీ మద్దతు కావాలి మా అభిమానులు వేసే ఓట్లు కావాలి , మీరు ముఖ్యమంత్రి అవ్వాలి ఇలా ఎన్నో రకాల కండిషన్స్ పెట్టే మీరు..జనసేన పార్టీ ఎదుగుతుంటే ఓర్వలేరు..మీరు గత ఎన్నికల్లో  ప్రచార సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళం కదా మరి ఇప్పుడు ఎందుకు ఏ విషయం కూడా మాకు తెలియనివ్వడం లేదు..అన్ని మీరయ్యి పాలన సాగిస్తూ మళ్ళీ మా మద్దతు ఎందుకు తీసుకున్నారు అంటూ చంద్రబాబు పై ఫైర్ అయ్యాడు పవన్. ఇదిలాఉంటే పవన్ ఒక కీలక విషయంలో బాబు కి సవాల్ విసిరారు.

 

Related image

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎందుకు ఈ ఎన్నికలని చంద్రబాబు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదని అన్నారు..మీ మీ స్వార్ధ ప్రయోజనాలకి పంచాయితీ వ్యవస్థని దారుణమైన పరిస్థితికి తీసుకు వెళ్తున్నారు ఇదేనా మీరు ప్రజలకి చేస్తున్న మేలు ఒక పక్క పచాయితీలని బ్రష్టు పట్టించడానికి జన్మభూమి కమిటీలు వేసి పంచాయితీలని నిర్వీర్యం చేసిపడేశారు..మరో పక్క ప్రతిపక్షం కూడా పంచాయితీ ఎన్నికలపై మిమ్మల్ని నిలదీయక పోవడం సోచనీయమని విమర్సిచారు.

Image result for janasena public meeting

మీకు  దమ్ము ధైర్యం ఉంటే పంచాయితీ ఎన్నికలు పెట్టండి ఈ సారి మేము తప్పకుండా పోటీ చేసి మా సత్తా ఏమిటో మీకు తెలిసేలా చేస్తామని సవాల్ విసిరారు..రాష్ట్రంలో పంచాయితీలు ఎందుకు పనికిరాకుండా పోయాయి అంటే తప్పకుండా అది చంద్రబు దయే అంటూ మండిపడ్డారు..తూగో జిల్లాలో ఉన్న భూర్గం పాడు పచాయితీ మాజీ సర్పంచికి ఉన్న తెలివితేటలని చంద్రబాబు సింగపూర్ కి అమ్మేసుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు…అయితే పంచాయితీ  ఎన్నికలకి జనసేనాని కాలు దువ్వడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చలకి దారితీస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసినట్టే అవుతుందని జనసేనుడు భావిస్తున్నాడట..ఏది ఏమైనా పశ్చిమ నుంచీ తూర్పు గోదావరికి జనసేనుడు వెళ్ళే ముందు పంచాయితీ ఎన్నికలపై తన వైఖరిని తెలుపడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..జనసేన గెలుపుకోసం పంచాయితీ ఎన్నికల్లో తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తామని హామీ ఇస్తున్నారు.

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *