తెలంగాణా ఎన్నికలు..జనసేనాని కీలక నిర్ణయం..???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు..తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని మౌనంగా ఉంటున్నారని..అందుకు కారణం లాలూచి పదినట్లా అంటూ కారుకూతలు కూసిన నేతలు అందరికి దిమతిరిగేలా ఈరోజు ఓ తెలంగాణా ఎన్నికల పై కీలక ప్రకటన చేశారు..తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన  ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై  ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము.

అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించాము.తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం.తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది.శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం  ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్  ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియచేస్తున్నాను…అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు జనసేనాని..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *