అభిమానులు…నా తప్పు సరిద్దుకుంటా..!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన అశేష అభిమానుల మధ్య ఎంతో వైభవంగా జరుగుతోంది… నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను పవన్ బహిరంగ వేదికలపై వెల్లడిస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు… అలాగే లోకేష్ ,చంద్రబాబుల అవినీతిపై కూడా పవన్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు… ఇదిలాఉంటే  ఉంటే అభిమానులను ఉద్దేశించి పవన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అది ఏంటంటే

అభిమానులనే వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడని, పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడు నాకు కొండంత అండగా నిలిచింది ఒకే ఒక్క అభిమానులేనని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అయితే జనసేన కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని , గుర్తింపు లేదని అభద్రతాభావం ఎవరికీ ఉండకూడదని పవన్ సూచించారు. అభిమానులని చాలామంది నేతలు గుర్తించడం లేదన్న అంశం పదే పదే తన దృష్టికి వస్తుందని మిమ్మల్ని గుర్తించలేని పరిస్థితి ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ తప్పులను సరిదిద్దుకుంటామని పవన్ అభిమానులని  ఉద్దేశించి  అన్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *