“గెలుపుకోసం”..పవన్ ఈ పని చేశాడా..??? నిజమెంత..???

ఏపీ లో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో సునామీ సృష్టిస్తుందా, లేక వైసీపీ సృష్టించే సునామీలో కొట్టుకుపోతుందో తెలియదు కానీ మొత్తానికి ఎదో ఒక విషయంలో మాత్రం వార్తల్లో నిలుస్తోంది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు ముంచుకొస్తున్న తరుణంలో తాజాగా వైరల్ అవుతున్న ఓ న్యూస్ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా తెలియడంతో అయ్యో పాపం పవన్ కళ్యాణ్ అంటూ సానుభూతి తెలుపుతున్నారట ఏపీ ప్రజలు..ఇంతకీ ఏమిటా న్యూస్..

Image result for pawan kalyan temple visit west godavari

పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి మొదట్లో అంతగా ఉండేది కాదని, త్రివిక్రమ్ పరిచయం అయిన నాటి నుంచీ పవన్ కళ్యాణ్ హోమాలు పూజలు చేయడం మొదలు పెట్టారనేది జనమెరిగిన సత్యం. అయితే గతంలో ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో హోమాలు నిర్వహిస్తూ ఉంటారనేది కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం. పవన్ తన గెలుపుకోసం నిర్వహించారట.

పవన్ విజయం కోసం హొమం?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా తన విజయం అలాగే పార్టీ విజయం కోసం భారీ హోమం నిర్వహించారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ వర్గాలలో జోరుగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. విజయం కోసం ఎవరైనా ప్రజా క్షేత్రంలో ప్రజాభిమానం పొందటానికి వ్యూహాలు రచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ విజయం కోసం హోమాలు నిర్వహించడం ఏమిటి అంటూ నవ్వుకుంటున్నారట. ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉండే తెలియదు కానీ ఇదే గనకా నిజం అయితే హోమం ఎఫెక్ట్ తెలుసుకోవాలంటే మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *