పవన్ అభిమానులకి షాక్ ఇచ్చిన…త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ అభిమానులని చాలా నిరాశకు గురిచేశాడు.పవన్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో చిత్రీకరిస్తున్న సినిమా టైటిల్ ని ప్రకటిస్తారు అనుకుంటే కేవలం కాన్సెప్ట్ పోస్టర్ ని మాత్రమే విడుదల విడుదల చేసి  అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అని అభిమానులు తెగ మధన పడిపోతున్నారట.

సంబంధిత చిత్రం

అయితే అభిమానాన్ని చంపుకోలేక ఈరోజు విడుదలైన ఈ కాన్సెప్ట్ పోష్టర్ లోని పవన్ లుక్ సూపర్‌గా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నమాట. కొందరేమో ‘ఖుషి’ తరహాలో వుందని మరికొందరు ‘గోపాల గోపాల’ మాదిరిగా ఉన్నాడంటూ,జల్సాలో కూడా ఇలానే ఉండేవాడు అనుకుంటూ  ఎవరికివాళ్లు సద్దుబాటు చేసుకుని చెప్పుకుంటున్నారు.

గతంలో ప్రచారంలోకి వచ్చిన ‘ఇంజనీర్‌ బాబు’ ‘రాజు వచ్చినాడో’ పేర్లలో ఏదోఒకటి ఫైనల్ చేయకుండా ఇలా సస్పెన్స్ ని కొనసాగించడం వెనుక ఎదో మతలబు ఉందని.ఎన్నో డైలాగులు రాసే త్రివిక్రమ్ కి టైటిల్ విషయం పెద్ద లెక్కకాదు.కానీ ఎందుకు ఇలా అభిమానులని వెయిట్ చేయిస్తున్నాడో  కేవలం త్రివిక్రమ్ కు మాత్రమే తెలియాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *