జనసేన మద్దతు ఉండదు..బాబు కి పవన్ జలఖ్

నంద్యాల ఉపఎన్నికలకు జనసేన దూరంగా ఉంటుందని  పవన్ కళ్యాణ్ తేల్చేశారు.అంతేకాదు జనసేన మద్దతు ఏ పార్టీకి ఇవ్వడంలేదు అని  చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగిపోయేలా ఒక  ప్రకటన చేశాడు. నంద్యాల ఉపఎన్నికలు మాత్రమే కాదు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన దూరంగా ఉంటుంది తెలిపారు. ఇదే తటస్థ వైఖరిని 2019 వరకూ ఏ ఉప ఎన్నిక వచ్చినా కొనసాగిస్తాం అని తెలిపారు.

సంబంధిత చిత్రం

ఉపఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం నాయకులు పవన సపోర్ట్ మాకంటే మాకే అని ఫోటో లతో సహా ప్రచారం చేసుకుంటున్నారు,మరోపక్క నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనకు లేఖ రాశారని, అలాగే కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మద్దతు కోరుతూ మరి కొందరు సంప్రదించారని చెప్పారు. ఇన్ని పరిణామాల తరువాత మా వైఖరి చెప్పడం అవసరం అని మాకు అనిపించింది,అసలు ఈ విషయంలో విజయవాడ వెళ్ళినపుడు మా వైఖరిని తెలిపి ఉండాల్సింది.  దీనికి సంబంధించి ఆయా ప్రాంత  అభిమానులు, కార్యకర్తల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నాం. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం అని మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు.

నంద్యాల ఉపఎన్నికల్లో నా పేరుగానీ ,జనసేన పార్టీ పేరుగానీ ఉపయోగించుకున్నా అది వారి వ్యక్తిగత విషయం తప్ప మేం ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు అని పునరుద్ఘాటించారు. నంద్యాల ఉపఎన్నికలకి జనసేన మద్దతు మాకే ఉంటుంది పవన్ ని ప్రచారానికి వస్తారు అని తొందరపడి ప్రకటన చేసిన మంత్రి అఖిలప్రియ,ఆ పార్టీ కార్యకర్తలకి పవన్ ప్రకటనతో పెద్ద షాకే తగిలింది. మా పార్టీకి ప్రజల్లో మద్దతు ఉన్నా వ్యవస్థాపరంగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 2019 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పేశారు జనసేనాని.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *