బాబుకి షాక్ ఇవ్వబోతున్న పవన్…

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఉద్దానం కిడ్ని బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప‌వ‌న్ ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్రబాబును క‌లిసిన సంగ‌తి తెలిసిందే. బాబును క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ ఉద్దానం సమస్యల మీద చంద్రబాబుతో బాగా డీప్ గా చర్చించాను… అక్కడ భాదితుల కోసం సంరక్షణ  చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు కూడా ప‌వ‌న్ చెప్పారు.
ఇక బాబుపై ఈగ వాల‌నీయ‌కుండా మాట్లాడిన ప‌వ‌న్ మ‌రోసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీకే స‌పోర్ట్ చేస్తాన‌ని ఇన్ డైరెక్టుగా హింట్స్ ఇచ్చేశాడు. ప‌వ‌న్ ఇప్ప‌టికే చంద్ర‌బాబును స‌పోర్ట్ చేస్తూ పొగుడుతూ మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రశ్నిస్తాను అన్న పవన్ ప్రభుత్వపరంగా ఎన్నో తప్పులు ఉన్నా వాటిని ప్రశ్నించడం మానేసి బాబుని మరోసారి గద్దె మీద కుర్చోపెట్టే పనిలో ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. 
నంద్యాల ఉపఎన్నికలకి మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తారు అని మీడియా అడిగిన ప్రశ్నలకి ఆ టైం లో డిసైడ్ అయ్యి చెప్తాను అని ప‌వ‌న్ చెప్పినా ప‌వ‌న్ స‌పోర్ట్ టీడీపీకే ఉంటుంద‌న్న క్లారిటీ చాలా మందికి వ‌చ్చేసింది. ఈ వ్యాఖ్యలకి బలం చేకురేటట్టు అఖిల ప్రియ మాట్లాడటంతో అందరికి సీన్ అర్థం అయిపోయింది. నంద్యాలలో యూత్, కాపు ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే బాబు పవన్ చెప్పిన ఏ పని అయినా చేక చేక చేసిసే పవన్ సపోర్ట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని తెగ ఆరాట పడిపోతున్నాడు బాబు.

షాక్ త‌ప్ప‌దా..!

ప‌వ‌న్‌పై బాబు ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నా ఇక్క‌డే ఓ షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. నంద్యాల ఉపఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలోనే చాలా కీలకం కానున్నాయి, ఈ ఎన్నిక ఫలితాల ద్వారానే ప్రజలు 2019 ఎవరిని ఎన్నుకోవాలో డిసైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మొత్తానికి ప్రధాన పార్టీల తల రాతల్ని మార్చేసే ఎన్నికలు నంద్యాల ఉపఎన్నికలు. ఒక వేళ పవన్ ఈ ఎన్నికలలో టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తే, ఇక్క‌డ వైసీపీ గెలిస్తే అప్పుడు త‌న ఇమేజ్‌కు కూడా మైన‌స్ అవుతుంద‌ని ప‌వ‌న్ ఇప్పుడు ఇక్క‌డ టీడీపీకి మ‌ద్దతు ఇచ్చే విష‌యంలో వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు స‌మాచారం. 
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *