రివ్యూ: ఫిదా

శేఖ‌ర్ క‌మ్ముల – వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో దిల్ రాజు నిర్మించిన ఫిదా సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ ఫిదా ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిందో లేదో రివ్యూలో చూద్దాం.

క‌థ‌:

అమెరికాలో డాక్టర్ గా పని చేసే వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్యకి పెళ్లి సంబంధం కోసం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాన్సువాడ‌కు వ‌స్తాడు. అక్క‌డ వరుణ్ అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి భానుమతి (సాయి పల్లవి) అని ఓ చెల్లి ఉంటుంది. ఆమె చేసే అల్లరితో ఆ పెళ్లిలో వరుణ్, భానుమతి అనుకోకుండా ఒకరికి ఒకరు తెలియకుడా ల‌వ్‌లో ప‌డిపోతారు. వీరి మధ్య అనుకోకుండా గ్యాప్ పెరిగిపోతుంది. చివ‌ర‌కు మ‌న‌స్ప‌ర్థ‌లు ఎక్కువై ఒక‌రినొక‌రు ద్వేషించుకునే వెళ‌తారు. ఈ లోగా భానుమ‌తిని త‌న తండ్రి అమెరికా తీసుకువెళ్లి అక్క‌డ మ‌రో వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యిస్తాడు. చివ‌ర‌కు వీరి మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు అస‌లు కార‌ణం ఏంటి ?   చివ‌ర‌కు వీరు క‌లిశారా ?  లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:

సినిమాలో బ‌ల‌మైన క‌థంటూ లేక‌పోయినా శేఖ‌ర్ త‌న‌దైన మార్క్ క‌థ‌నంతో సినిమాను ముందుకు న‌డిపించాడు. ఇక సినిమాలో ఫ‌స్టాఫ్ చూసిన వాళ్లు సెకండాఫ్‌పై మ‌రింత అంచ‌నాలు పెంచుకుంటారు. సెకండాఫ్‌లో సినిమా బాగా లాగ్ అయ్యింది. ఓవ‌రాల్‌గా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు న‌చ్చే వారికి ఫిదా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చుతుంది.

 

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– వరుణ్ తేజ్, సాయి పల్లవి కెమిస్ట్రీ

– శేఖర్ కముల స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ స్టోరీ

– ఎమోషనల్ డైలాగ్స్

– మ్యూజిక్

– కామెడీ సీన్స్

– పాటల చిత్రీకరణ

– లొకేషన్స్

– సినిమాటోగ్రఫీ

 

మైన‌స్ పాయింట్స్ (-):

– బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం

– సెకండాఫ్‌

– ఎడిటింగ్‌

 

ఫిదా రేటింగ్‌: 3.25 / 5

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *