పూరీ డ్ర‌గ్ ఎడిక్ట్‌… ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు..!

టాలీవుడ్ డ్ర‌గ్ మాఫియాలో రోజుకో కొత్త సంచ‌ల‌నం వెల్ల‌డ‌య్యేలా ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగానే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో బుక్కయ్యేలా కనిపిస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్‌ను విచారించాక చాలా అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే కెల్విన్ చెప్పిన విష‌యాల ఆథారంగా సిట్ అధికారులు ముందుగా బుధ‌వారం ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌ను విచారించిన సంగ‌తి తెలిసిందే.
పూరీని సిట్ బృందం ఏకంగా 11 గంట‌ల పాటు విచారించింది. ఇక ఫైన‌ల్‌గా పూరీ డ్రగ్స్ వాడారా.. లేదా అని నిజ నిర్థారణకి పూరీ శరీరం నుండి ఎంట్రుకలు, గోళ్లు తీసుకున్నారు. అయితే వాటిని పలు రకాల పరీక్షలు చేశారు. వాటికి సంబంధించిన ఫలితాలు ఉస్మానియా డాక్టర్లు ఎక్సైజ్ కార్యాలయానికి సమర్పించారు.
ఈ రిపోర్టు ఇంకా పూర్తిగా బ‌య‌ట‌కు రాక‌పోయినా ఓ ఉస్మానియా డాక్ట‌ర్ ప్రాథమిక రిపోర్టులో పూరీ డ్రగ్స్ వాడారని తెలిపారు. ఇక పూరీ జగన్నాథ్ డ్రగ్స్ వాడారని నిర్థారణ అవ్వడానికి ఆయన ఎంట్రుకలను, గోళ్లను పోరేన్సిక్ ల్యాబ్ కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక త‌ర్వాత ఎక్సైజ్ అధికారులు ఏ క్ష‌ణంలో అయినా పూరీని అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని మీడియా వ‌ర్గాల్లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *