“వినయ విధేయ రామ” ఆ పాత్రలో పవర్ స్టార్..???

 

బోయపాటి , రాంచరణ్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమా “వినయ విధేయ రామ”  ఇప్పటికే ఈ సినిమా పోస్టర్..టీజర్ రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది.పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది…ఈ సినిమాలో రాంచరన్ కొణిదల రామ్ గా కనిపించబోతున్నాడు..

Image result for vinaya vidheya rama official teaser

అంతేకాదు ఈ సినిమాలో పాత తరం దర్శకుడు  ఈవీవీ సత్యన్నారాయణ  గారి పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ కూడా నటిస్తున్నాడు..ఈ చిత్రంలో రాజేష్ రాంచరణ్ అన్నయ్యగా ఉండబోతున్నాడట. ఇదిలాఉంటే ఈ సినిమాకి సంభందించిన ఒక లేటెస్ట్ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది..ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు గాని లేదంటే ఇంటర్వెల్ తరువాత కాని రాంచరన్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

Image result for vinaya vidheya rama working stiles

అంతేకాదు..ఈ సినిమాలో ఒక ఫైట్ ని పవన్ కంపోజ్ చేస్తాడని కూడా తెలుస్తోంది…గతంలో చిరంజీవి డాడీ సినిమాకి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన అన్నయ్య చిరు కోసం  ఫైట్ కంపోజ్ చేశాడు..ఆ ఫైట్ అప్పట్లో సంచలనం అయ్యింది కూడా మరి తన అన్నకొడుకు సినిమాలో పవన్ ఫైట్ కంపోజ్ చేస్తాడా లేక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *