బాబుకు మ‌రో షాక్‌: వైసీపీ గూటికి ప్ర‌కాశం ఎమ్మెల్యే..

నంద్యాల ఉప ఎన్నిక వేళ టీడీపీకి వ‌రుస‌గా షాకులు త‌గులుతుండ‌గానే ఇప్పుడు ఆ పార్టీకి అంతంత మాత్రం మెజార్టీ ఉన్న ప్ర‌కాశం జిల్లాలో మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. టీడీపీ సీనియర్ నేత – ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ అధిష్ఠానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాంబాబు…  కాసేపటి క్రితం తన కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అవమానాలు ఎదురవుతున్న టీడీపీలో ఉండటం కంటే పార్టీకి రాజీనామా చేయడమే బెటరని కార్యకర్తలంతా ఆయ‌న‌పై ప్రెజ‌ర్ చేయ‌డంతో ఆయన అక్క‌డిక‌క్క‌డే డెసిష‌న్ తీసుకున్నారు.
ఈ స‌మావేశంలోనే ఆయ‌న తన మెడలో ఉన్న టీడీపీ కండువాను అక్కడికక్కడే చేతిలోకి తీసుకున్న రాంబాబు… దానిని కింద గిరాటేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనాభరితంగానే కాకుండా ఆగ్రహావేశంగానూ సంచలన వ్యాఖ్యలు  చేశారు. ఆ వెంటనే పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీలో ఉండ‌డం కంటే సిగ్గుచేటు మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పారు.
2009 ఎన్నికల్లో ప్ర‌జారాజ్యం నుంచి గెలుపొందిన రాంబాబు ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని విడిచి టీడీపీలో చేరారు. టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. గిద్దలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్‌ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరడంతో అన్నా రాంబాబుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు పరిటాల రవి అనుచరుడిగా ఉన్న రాంబాబు టీడీపీ ప్రభుత్వంలో కనీసం తనకు విలువ లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇక పార్టీని వీడిన రాంబాబు త్వ‌ర‌లోనే వైసీపీలో చేర‌నున్నార‌ని తెలుస్తోంది
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *