పూరీ.. ఇదేం కిరి కిరి..

పూరీ జ‌గ‌న్నాధ్ మాట‌లు ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నాయి. డ్ర‌గ్స్ కేసులో నిండా మునిగిపోతున్న పూరీకి కొండంత అండ‌గా నిల‌బ‌డిన  వైకాపా శ్రేణులు ఇప్పుడు అత‌ని వ్య‌వ‌హార‌శైలిని చూసి జీర్ణించుకోలేక‌పోతున్నారు. పూరీని డ్ర‌గ్స్ ఉచ్చులోఇరుక్కున్న‌ప్పుడు తెదేపా అనుకూల  మీడియా  తెదేపా వ‌ర్గీయులు పూరీని ల‌క్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోశారు.కెమెరా గంగాతో రాంబాబు సినిమాని కేసీఆర్ కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుని తీశాడ‌ని అప్ప‌ట్లో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం పూరీకి అండ‌గా నిల‌బ‌డ‌డంతో మొత్తానికి గండం నుంచి పూరీ గ‌ట్టెక్కాడు. ఇప్పుడు ప‌రిస్థితులు తారుమారాయ్యాయి.

సంబంధిత చిత్రం

పూరీ జ‌గ‌న్నాధ్ కి డ్రగ్స్ మాఫియా తో సంభందాలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణా అబ్కారీ శాఖ పూరీకి, తన కోటరీ వ్యక్తులకి నోటీసులు జారీచేసి విచారణ కూడా చేశారు. ఈసమయంలో పూరీకి కొండంత అండగా నిలిచింది వైకాపా అధినేత జ‌గ‌న్‌తో పాటు వైకాపా శ్రేణులు మాత్రమే. పూరీ జ‌గ‌న్నాధ్ మొద‌ట నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంతో స‌న్నిహితంగా ఉన్నారు. వైఎస్ చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ని హీరో రాజ‌శేఖ‌ర్‌ని పెట్టి సినిమా తీయాల‌ని అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.పూరీకి జగన్ తో ఉన్న రిలేషన్ తో త‌మ్ముడు పెట్ల గ‌ణేష్‌ని వైకాపాలోకి పంపించారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర్సీప‌ట్నం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ వైకాపా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగ‌తున్నారు.

poori speech audio function కోసం చిత్ర ఫలితం

పూరీకి జ‌గ‌న్‌తో ఉన్న‌సంబంధాల నేప‌థ్యంలో తెదేపా మీడియా పూరీని చాలా దారుణంగా టార్గెట్ చేసింది.పూరీ ఈ విషయంలో మీడియా మీద తన అసహనాన్ని తెలియచేశారు.ఇక అసలు విష‌యానికి వ‌స్తే పూరీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టించిన పైసా వ‌సూల్ ఆడియో పంక్ష‌న్లో పూరీ మాట్లాడిన మాట‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నంద్యాలలో  ఒక రోజు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బాల‌కృష్ణ త‌న అభిమానిపై చేయిచేసుకుని తోసివేసిన ఘ‌ట‌న ఇప్పుడు జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెదేపా వ‌ర్గాల‌తోపాటు బాల‌కృష్ణ అభిమానులు కూడా బాల‌కృష్ణ వ్య‌వ‌హారంపై గుర్రుగా ఉన్నారు.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఈ వ్య‌వ‌హారంపై క‌క్క‌లేక మింగ‌లేక మిన్న‌కుండిపోయారు. ఈ విష‌యంపై సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలిసింది. ఇలాంటి త‌రుణంలో బాల‌కృష్ణ‌ని వెన‌కేసుకొస్తూ పూరీ జ‌గ‌న్నాధ్ ఆడియో పంక్ష‌న్లో హీరోలలో ఎవరన్నా బౌన్సర్లని చుట్టూ పెట్టుకుని బయటకి వెళ్తారు కానీ బాలయ్య కి అవసం లేదు ,ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్‌ చేసుకోగలరు. మీద పడుతుంటే కొడుతుంటారు. ఫ్యాన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు. బాలయ్యకు, ఫ్యాన్స్‌కు ఉన్న రిలేషన్‌ అది అని పూరి జగన్నాథ్ అన్నారు. భవిష్యత్‌లో బాలయ్య ఎవరిని కొట్టినా అది ప్రేమగా కొట్టాడు అని ఫీల్ అవ్వండి అని అభిమానులకి సలహా ఇచ్చాడట.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *