చరణ్ మరో పాన్ ఇండియా సినిమా….బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు…

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న భారీ చిత్రం సెట్స్ పైన ఉంది. ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ కు సిద్దంగా ఉంది. బాలివుడ్ బ్యూటీ కీయరా అద్వాని హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం లో కనపడనున్నారు. అగ్ర తారలు ఎంతో మంది ఈ సినిమాలో కనిపించి అలరించనున్నారని తెలుస్తోంది. కాగా

Ram Charan-Buchi Babu Sana pan-India film - The South First

చరణ్ మరొక పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని అఫీషియల్ గా ప్రకటించారు చరణ్. అయితే శంకర్ సినిమా తరువాత  గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంతో చరణ్ సినిమా ఉంటుందని అనుకున్నారు అందరూ కానీ అనూహ్యంగా బుచ్చిబాబు తెరమీదకు రావడంతో ఈ సినిమా ఒప్పుకోవడానికి అంత స్పెషల్ ఏంటాఅనే ఆత్రుత మెగా ఫ్యాన్స్ అందరిలో నెలకొంది.

RRR star Ram Charan's comes together with Uppena director Buchi Babu Sana  for NEW pan-India film

రామ్ చరణ్ స్వయంగా బుచ్చి బాబు అండ్ టీమ్ తో తాను పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాదు ఈ సినిమా ను సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారట.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *