పైసా వసూల్..రివ్యూ

బ్యాన‌ర్: భ‌వ్య క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌, కైరా ద‌త్‌, క‌బీర్ బేడి, విక్ర‌మ్ జీత్‌, పృథ్వీరాజ్‌, అలీ త‌దిత‌రులు

మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌

నిర్మాత: వి.ఆనంద ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌.జి

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ, మాస్ ప్రేక్షకులకి నచ్చే సినిమాలు తీసే దర్శకుడు పూరీ జగన్నాథ్ వీళ్ళ రూటే సపరేటు.వీరి ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే పైసా వసూల్. ఈ సినిమా మొదలైనప్పటి నుండి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందో అని వెయ్యి కళ్ళతో వేచి చూశారు అంతా. పైసా వసూల్ సినిమా ట్రైలర్,టీజర్ లలో పూరి మార్క్ డైలాగులతో బాలయ్య రెచ్చిపోయాడు. బాలయ్య బాడీ లాంగ్వేజ్, లుక్ చాలా కొత్తగా,డిఫరెంట్ గా ఉండటంతో సినిమా సగటు ప్రేక్షకుడి దృష్టి కూడా ఆకర్షించింది. ఈ రోజు రిలీజ్ అయిన పైసా వసూల్ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలియాలంటే ముందు కధలోకి వెళ్దాం.

కధ:

బాబా మార్లే ఒక పెద్ద మాఫియా డాన్ పోర్చుగల్ లో ఉంటాడు,తన తమ్ముడు సన్నీ ని ఇండియన్ రా ఆఫీసర్ చంపడంతో ఇండియా మీద పగపడుతాడు  “డాన్ మార్లే” ఇండియాలో మారణ హోమం సృష్టించి తన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. తనకు ఇండియాలో లోకల్ మాఫియా,ఓ మినిస్టర్ సహకారం ఉంటుంది. బాంబులు పేల్చి హైదరాబాద్ లో అలజడులు రేపుతాడు ఈ పేలుడులో అమాయక జనం చనిపోతారు.మాఫియా చేతిలో పొలిసు అధికారులు చనిపోతారు.అదే సమయంలో “రా” చీఫ్ (కబీర్ బేడి) ఓ గ్యాంగ్ స్టర్ (బాలకృష్ణ) ని మఫియాకి వ్యతిరేకంగా పెట్టుకుని అంతమొందించడానికి డీల్ కుదుర్చుకుంటుంది. బాలకృష్ణ (తేడాసింగ్) పక్క ఇంట్లో ఉండే హారిక (ముస్కాన్) వెంట‌ప‌డుతుంటాడు.  హారిక తన అక్క సారిక (శ్రియ)కోసం వెతుకుతూ ఉంటుంది.సారికకి,తేడా సింగ్ కి మధ్య రేలషన్ ఉందని హారికకి తెలుస్తుంది.అసలు తేడా సింగ్ ఎవరు? సారిక,తేడా సింగ్ మధ్య రేలషన్ ఏమిటి ? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా ని చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్రంలో పూరి బాలయ్యని చూపించిన విధానం చాలా బావుంది. బాలకృష్ణ తన యాటిట్యూడ్, హావ భావాలతో అదరగొట్టేశాడు. మధ్య మధ్యలో వచ్చే పూరి మార్క్ పంచ్ డైలాగులకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బీహార్‌లో తాగించిన‌వాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే, న‌న్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి, వంటి చాలా డైలాగులు ఈ సినిమాలో ఆడియ‌న్స్ ని మెప్పిస్తాయి. పూరి జగన్నాథ్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో కూడా అలాంటి పాటలు, ఫైట్స్ ఉన్నాయి. బాలకృష్ణ వన్ మాన్ షోగా ఈ చిత్రాన్ని నడిపించాడు. పూరి సినిమాలు సంక్లిష్టంగా ఉండవు. ఈ చిత్రం కూడా అలాగే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని బాగానే నడిపించిన పూరి సెకండ్ హాఫ్ లో తడబడ్డట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటె సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. క‌థలోనూ చెప్పుకోద‌గ్గంత కొత్త‌ద‌నం ఏమీ లేదు. మొత్తానికి పూరి సినిమాలు ఇష్టపడేవారు అద్భుతంగా పండిన బాలయ్య మ్యానరిజమ్స్ తో ఈ చిత్రాన్ని చూస్తే తప్పక నచ్చే అవకాశం ఉంది. కానీ జనరల్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

ప్ల‌స్ పాయింట్స్

– బాల‌కృష్ణ న‌ట‌న‌

– డైలాగ్స్‌

– ఎడిటింగ్

 

మైన‌స్ పాయింట్స్

– సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు.

– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించలేదు

– క‌థ‌

కామెడీ లేకపోవడం 

రేటింగ్ – 3.2/5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *