ఆ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెప్ప‌లేక రోజా ప‌రార్‌..

నోటికి ఏది వ‌స్తే అది ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడేయ‌డం వైసీపీ ఎమ్మెల్యే రోజా నైజం. ఇప్ప‌టికే అసెంబ్లీలో చంద్ర‌బాబును, తోటి మ‌హిళా ఎమ్మెల్యేల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన కేసులో ఆమె యేడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ సైతం ఆమె నోటిని కంట్రోల్ చేసుకోవాల‌ని ఎన్నోసార్లు చెప్పినా ఆమె తీరు మార్చుకోలేదు. తాజాగా ఆమెను నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో అక్క‌డ ఆడ‌ప‌డుచులు నిల‌దీయ‌డంతో ఆమె అక్క‌డ నుంచి త‌ప్పించుకున్నారు.
నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆమె నంద్యాల మునిసిపాలిటీలోని 16వ వార్డులో ప్ర‌చారానికి వెళ్లారు. దీంతో ఆమెను అక్క‌డ మ‌హిళ‌లు అడ్డుకున్నారు. ఇటీవ‌ల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌ర్చేలా మాట్లాడార‌ని దీనిపై ఓ మ‌హిళా నేత‌గా మీరు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆమెను చుట్టుముట్టి నిల‌దీశారు.
జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి టీడీపీ, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తే శిల్పా మోహ‌న్‌రెడ్డికి 2004లో వ‌చ్చిన 49 వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు అయినా ఎక్కువ రాక‌పోతే మ‌నం మ‌గాళ్లం కాదు..ఆడాళ్లం అని మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. చ‌క్ర‌పాణిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్ర‌మంలోనే రోజా శుక్ర‌వారం నంద్యాల పట్ట‌ణంలో ప్ర‌చారం చేస్తుండ‌గా అక్క‌డి మ‌హిళ‌ల నుంచి ఆమెకు ఇదే ప్ర‌శ్న ఎదురైంది. ఆమెను చుట్టుముట్ట‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌ను దూషించారు. చివ‌ర‌కు పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వారికి స‌ర్దిచెప్పడంతో రోజా ఆ మ‌హిళ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక అక్క‌డ నుంచి వైసీపీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఏదేమైనా నోరు తెరిస్తే చాలు రెచ్చిపోయే రోజా నంద్యాల మ‌హిళ‌ల ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెప్ప‌లేక అక్క‌డ నుంచి జారుకున్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *