“శబరిమల బోర్డు”….సంచలన నిర్ణయం..

యావత్ దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న ప్రధాన అంశాలలో శబరిమల ఆలయ విషయం ఒకటి..ఈ ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాల్ని సాంప్రదాయలని తుంగలోకి తొక్కి మరీ ఆలయంలోకి అనుమతిని ఇవ్వడం అనేది హిందువులు ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు..వయసుతో నిమ్మిత్తం లేకుండా ఎవరన్నా సరే ఆలయంలోకి ప్రవేశించవచ్చునని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పటికే ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరం నెలకొంది..మహిళలు గనుకా ఆలయంలో ప్రవేశించాలని అనుకుంటే చంపేస్తామని అంటున్నారు అక్కడి భక్తులు..

Image result for sabarimala issue

అయితే అన్య మతస్తులు కావాలని కొందరు మహిళలు ఆలయంలోకి హిందువులుగా వచ్చి ఆలయ ప్రతిష్టకి భంగం కలిగించే అవకాశాలు చాలా ఉన్నాయని కొన్ని ఆధారాలతో కూడా రుజువవ్వడంతో ఆలయ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది..తీర్పుపై పునఃసమీక్షను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని టీడీబీ అధ్యక్షుడు పి.పద్మకుమార్ మీడియాకు తెలిపారు.

Image result for sabarimala issue

అయితే ఆలయం గత బుధవారం తెరుచుకోగా మహిళలు రావడాలని అనుకోవడంతో గత మూడు రోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లు రువ్వడం, పోలీసుల లాఠీచార్జి వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసుల ఎస్కార్ట్‌తో కొండ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలు సైతం ఆందోళనకారులు అడ్డగించడం, బెదరింపులతో వెనుదిరుగుతున్న ఘటనలు శుక్రవారంనాడు కూడా చోటుచేసుకున్నాయి…ఈ పరిస్థితులని అదుపు చేయాలని మరియు ఆలయ పవిత్రతకి సాంప్రదాయానికి భంగం కలగకుండా ఉండాలని రివ్యూ పిటిషన్ వేసిన బోర్డు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *