ఈ నటి ఎవరో గుర్తుపట్టారా…?? రాజభోగాలు అనుభవించిన ఆమె నేడు…

ఒకప్పుడు సత్తు గిన్నెల్లో భోజనం చేసిన వాళ్ళు కలిసి వస్తే బంగారు కంచంలో భోజనం చేయచ్చు, అదే అదృష్టం కలిసి రాకపోతే విలాసవంతమైన భవంతులలో ఉన్న వాళ్ళు అద్దె కట్టలేని పరిస్థితిలో అద్దెకు ఇల్లు తీసుకుని అష్టకష్టాలు పడచ్చు, అందరూ ఉన్నా ఎవరూ లేని అనాధగా మిగిపోవచ్చు. ఈ రకమైన పరిస్థితి ఎక్కువగా సినిమా రంగంలోనే కనిపిస్తుంటుంది. తాజాగా ఓ నటిని సోషల్ మీడియాలో చూసిన కొందరు ఆమె ఈ మేనా అంటూ షాక్ అవుతున్నారు. ఆమెను అభిమానించే వాళ్ళయితే ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంతకీ ఈమె ఎవరూ…

సీనియర్ నటి, ఇప్పటి వారికీ తెలియకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి బాగా సుపరిచితురాలు. అలనాటి స్టార్ హీరోలతో కలిసి దాదాపు 500 లకు పైగా సినిమాలలో నటించింది. ఆమె పేరు ఘాన్సీ. సినిమా నిర్మాతగా తన భర్త తో కలిసి ఎన్నో సినిమాలను నిర్మించింది. నటనలో ఆమెకు ఆమె సాటి. చెన్నై లో విలాసవంతమైన భవనాలు కొట్లాది ఆస్తులు ఉన్న ఆమె నేడు హైదరాబాద్ లో ఓ అద్దె ఇంట్లో కాలం వెళ్ళ దీస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్ళు.

 

చెన్నై నుంచీ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలి వచ్చిన సమయంలో ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. అయితే అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఆమె తన సొంత బ్యానర్ లో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. సుమన్ హీరో గా ఖైదీ ఇన్స్పెక్టర్ సినిమాను తీసారు అదే వాళ్లకు అతి పెద్ద మైనస్ అయ్యింది. ఆ సినిమా ఆదరణ పొందినా డబ్బులు పెద్దగా రాలేదు పైగా ఆ సినిమా దెబ్బకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. అప్పట్లో సుమారు రూ. 1 కోటి పైగా అప్పుల్లో ఉండగా చెన్నై లో ఉన్న ఆస్తులు, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చిందని ఆమె ఎంతో బాధతో చెప్పారు. ఇద్దరు కొడుకులు ఉన్నా ఆమెను పట్టించుకోవడం లేదని వాళ్లకు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేశానని ఆమె వాపోయింది. ఒక్కదాన్నే ఇలా కాలం వెళ్ళ దీస్తున్నానని తన భాదను చెప్పుకొచ్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *