డ్వాక్రా మహిళలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ త్వరలో..రూ. లక్ష

మన ప్రధాని మోడీ మహిళలు స్వయం శక్తి గా ఎదగాలని  ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారు. వారి అభ్యున్నతి కోసం మోడీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా  ఎన్నో అవకాశాలు అందించిన మోడీ తాజాగా  మహిళలకు గుడ్ న్యూస్ ప్రకటించారు. మహిళల ఆదాయమే పెంపు లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ప్రతీ ఏట లక్ష సంపాదించుకునేలా ల్యాక్ పతి SHG అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

Women belonging to Self Help Groups on the way to become Lakhpati - Nation

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా వచ్చే రెండేళ్ళలో 2. 5 కోట్ల మంది స్వయం సహాయక సంఘాలలో మహిళలకు ఆదాయం, జీవన ప్రమాణం పెంచేలా చర్యలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో  మహిళ మరింతగా ఆర్ధిక పుష్టిని సాధించుకోవచ్చునని అంటున్నారు పరిశీలకులు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *