టీడీపీ కి “భారీ షాక్”…..జనసేనలోకి….”ఆ కీలక నేత”

జనసేనలోకి నేతల చేరికలు పార్టీకి మరింత బలాన్ని ఇస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో తుఫాను భాదితుల కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ భాదితులని పరామర్శించిన తరువాత జనసేన లోకి టీడీపీకి చెందిన కొంతమంది నేతలు చేరారు…తెలుగుదేశం పార్టీ తరపున ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమైన సుందరపు విజయకుమార్‌ జనసేన పార్టీలోకి వెళ్లారు.

Related image

జనసేన పార్టీలో చేరటానికి ప్రధానమైన కారణం ఒక్కటేనని పవన్‌కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చాయని, ఆయనలా ప్రజలకు అండగా వుండేందుకు జనసేనలో చేరానని ఆయన తెలిపారు..అంతేకాదు మునగపాక తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత జెడ్‌పీటీసీ సభ్యుడు దాడి లక్ష్మీసత్యనారాయణ సతీమణి హెన్నా కూడా జనసేన పార్టీలో చేరారు. గోపాలపట్నానికి చెందిన బిల్డర్‌ విల్లా శ్రీనివాసరావు గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు..అయన కూడా ఇప్పుడు జనసేనలో చేరడంతో పార్టీ ఆ ప్రాంతంలో మరింత బలపడిందని నేతలు అంటున్నారు

Image result for sundarapu vijay kumar

గాజువాక(మింది)కి చెందిన ఈటి రంగారావు, పాయకరావుపేటకు చెందిన శివదత్‌, యంగ్‌ ఇండియా ట్రస్టు ప్రతినిధి పి.వెంకట సురేశ్‌, విశాఖకు చెందిన న్యాయవాది చంద్రమౌళి తదితరులు పార్టీలో చేరారు…అయితే  వైసీపీ మహిళా విభాగం ప్రతినిధి కీలక నేత అయిన పసుపులేటి ఉషాకిరణ్‌ జనసేనలో చేరే సూచనలు కనిపిస్తున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *