రవితేజ కెరీర్‌ను క్లోజ్ చేస్తోందెవ‌రు..!

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోన్న డ్ర‌గ్స్ కేసు ఉదంతంలో రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ నోటి నుంచి వచ్చిన నిజాలతో టాలీవుడ్ షేక్ అయితే.. అంతకు మించి అన్న రీతిలో తాజాగా విచారిస్తున్న జీషన్ చెపుతోన్న నిజాల‌తో సిట్ మొత్తం దిమ్మ‌తిరిగి అవాక్కైన‌ట్టు తెలుస్తోంది. మాస్ మ‌హ‌రాజ్ రవితేజ.. ఒకప్పటి హీరో నవదీప్ కు జీషన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా సిట్ ఎదుట చెప్పినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన ఆధారాల్ని సిట్ సేకరించినట్లుగా తెలుస్తోంది.
జీషన్ అలీ సౌత్ ఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు ఇచ్చేవాడని.. వాటిని ఆయన సరఫరా చేసేవాడని స‌మాచారం. రవితేజతో పాటు.. నవదీప్‌కు కూడా జీషన్ అలీ డ్రగ్స్ సరఫరా చేసే వాడని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని సిట్ కొంతమేర సేకరించినట్లుగా తెలుస్తోంది.
డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ తర్వాత కీలక పాత్ర జీషన్ అలీ దేనని చెబుతున్నారు. జీష‌న్ చెప్పిన‌దానిని బ‌ట్టి చూస్తుంటే ర‌వితేజ గురించి చాలా కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడ‌ని అంటున్నారు. అవి బ‌య‌ట‌కు వ‌స్తే ర‌వితేజ కెరీర్‌కు చాలా ఇబ్బందే అని కూడా తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. ర‌వితేజ‌ను విచారించిన తర్వాత డ్రగ్స్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారుల దృష్టికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *