సిట్ రెండో లిస్టులో టాలీవుడ్ పెద్ద విల‌న్‌

డ్ర‌గ్స్ ఇష్యూలో నిమిషానికో కొత్త పేరు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే సిట్ ఫ‌స్ట్ లిస్టులో ఇప్ప‌టికే 12 మంది టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ అవ్వ‌గా ఇప్పుడు త్వ‌ర‌లోనే సిట్ రెండో లిస్టు కూడా రానుంద‌ని తెలుస్తోంది. ఈ రెండో లిస్టులో ఓ అదిరిపోయే పేరు బ‌య‌ట‌కు రానుంద‌న్న స‌మాచారం ఇప్పుడు టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. రెండో లిస్టులో వినిపిస్తోన్న సెన్షేష‌న‌ల్ పేరే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మార‌నుంద‌ని తెలుస్తోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందనడంలో సందేహం లేదు. ఓ భారీ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అతను, కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన రికార్డునూ మూటగట్టుకున్నాడు. అయితేనేం, డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన ఈ హీరో పేరు గతంలోనూ డ్రగ్స్ కేసులో ఓసారి తెరపైకి వచ్చింది.
గ‌తంలో స‌ద‌రు వ్య‌క్తి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆధారాల్లేక అప్పల్లో అత‌డు సేఫ్ అయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్‌ల‌ను విచారించే క్ర‌మంలో అతడి పేరు కూడా బ‌య‌ట‌కు వ‌స్తోంది. రెండో దఫా విచారణను ఎదుర్కొనే వారిలో ఇతనే అత్యంత కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఇక యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఉన్న మ‌రో టాప్ హీరోకు కూడా సిట్ రెండో లిస్టులోనే నోటీసులు జారీ అవుతాయ‌ని తెలుస్తోంది. ఈ రెండు పేర్ల‌తో టాలీవుడ్ షేక్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *