you gave me goosebumps rajani kanth

కాంతారా పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్…ఈ సినిమా ఓ…

ప్రస్తుతం  ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ మారిన చిత్రం కాంతారా.  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు యావత్ చిత్ర  పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకుంది.  ఈ ఒక్క సినిమా తో రిషిబ్శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యారనటం లో సందేహం లేదనే చెప్పాలి. కన్నడ లో కేజిఎఫ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి సక్సస్ ఫుల్ గా దూసుకుపోతోంది కాంతారా.  కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనాలను సినిమా హాల్స్ కు క్యూ కట్టేలా చేసింది.

ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా, హడావిడి, హంగు, ఆర్భాటాలు లేకుండా విడుదలై  రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది ఈ కన్నడ మూవీ.  ప్రేక్షకులు, టాప్ సెలబ్రిటీ లు , విమర్శకులు సైతం  ఈ సినిమాపై  ప్రసంశల వర్షం కురిపించారు. ఇదిలాఉంటే ఈ సినిమా కు  కథ,దర్శకుడు,హీరో అన్నీ రిషిబ్ శెట్టినే అవడంతో ఆయనకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు సహజసిద్దమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రిషబ్. ఆయన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది.  ఈ సినిమాపై ప్రశంసలజల్లు కురిపిస్తున్న వారిలో అగ్ర హీరోలు కూడా ఉన్నారు. తాజాగా

ఈ మూవీ చుసిన సూపర్ స్టార్ రజని కాంత్ కాంతారా సినిమా ఓ అద్భుతమంటూ ప్రశంసించారు. సినిమా చూసిన తరువాత రజనీ ఎంతో తన్మయత్వంతో ఉండిపోయారట. తన భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత. ఈ విషయాన్ని  హోమ్బలే  ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ చెప్పినంత గొప్పగా  ఎవరూ  చెప్పలేరు, సినిమా చూస్తున్నంతసేపు నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. కంగ్రాట్స్ టు టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ థిస్  “మాస్టర్ పీస్” అంటూ రిషబ్ శెట్టికి , సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *