చిరు సైరా కాస్టింగ్ అదిరిపోయిందోచ్ (వీడియో)…

చిరంజీవి నెక్స్ట్ సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ ఆధారంగా తీయబోతున్న సినిమా లో ఎవరు ఎవరు నటించబోతున్నారు ? టెక్నికల్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు,మ్యూజిక్ ఎవరు ? ఇలాంటి ప్రశ్నల కి సమాధానాల్ని అభిమానులకోసం మరొక వీడియో రూపంలో విడుదల చేశారు.

చిరు 151వ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నార‌న్న వార్త‌లు ముందు నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే నిజ‌మైంది. బిగ్ బీ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు. క‌థానాయిక‌గా న‌య‌న‌తార పేరు ఖ‌రారైంది.

https://youtu.be/mdY7MK9jIS8

రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ర‌వి వ‌ర్మ‌న్ కెమెరా అందించ‌బోతున్నారు. రాజీవ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. ఇందులో ఐశ్వ‌ర్యారాయ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని ప్ర‌చారం జోరుగా సాగింది. దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాస్టింగ్‌లో కూడా ఆమె పేరు క‌నిపించ‌లేదు. డిజిట‌ల్ పోస్ట‌ర్ కోసం మాత్రం త‌మ‌న్ నేప‌థ్య సంగీతం అందించాడు.మొత్తంగా ఈ సినిమా టాలీవుడ్ ని షేక్ చేస్తుంది అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తెరవెనుక పనిచేసే వారిని ఇలా చూపించడం కూడా చాలా డిఫ్ఫ్రెంట్ గా ప్లాన్ చేశారు మరి మీరు కూడా ఓ లుక్ వేయండి..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *