స్టార్ హీరో భారీ విరాళం…అంతేకాదు..!!!

తమిళ నాట హీరో సూర్యాకి ఉన్న ప్రజాభిమానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నోవిభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అభిమానులని అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫంధాని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రతీ సినిమా ద్వారా సోషల్ మెసేజ్ అందించే సూర్యా సేవా కార్యక్రమాలలో సైతం ముందు ఉంటారు. తమిళ హీరో సూపర్ స్టార్ రజని కాంత్ తరువాత తెలుగు ప్రజలు హీరో సూర్యాని ఎక్కువగా అభిమానిస్తారని చెప్పడంలో సందేహం లేదు.

Actor Suriya raises concern over draft National Education Policy

ఓ స్వచ్చంద సేవా సంస్థని ఏర్పాటు చేసుకుని ఎంతో మంది అనాధ, పేద పిల్లలకి చదువులు చెప్పిస్తున్న సూర్యా మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకుని ఆర్ధికంగా చితికిపోయిన ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కార్మికుల కుటుంభాలకి రూ. 1.5 కోట్ల భారీ విరాళాన్ని సూర్యా అందించారు. అంతేకాదు అక్టోబర్ 30 న అమెజాన్ లో విడుదల అవ్వడానికి సిద్దంగా ఉన్న సూర్యా సినిమా ఆకాశమే హద్దురా సినిమా ద్వారా వచ్చే వసూళ్ళలో రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని కూడా కరోనా బాధితులకి సాయంగా అందిస్తానని ప్రకటించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *